భారత్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. ఈ వైరస్ బారిన పడి 46 మంది ప్రాణాలు కోల్పోగా, 138 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీలోని మర్కజ్ భవనంలో ఉన్న వారందరికీ కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు మర్కజ్ భవనంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాల కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మహారాష్ట్ర, కేరళలో 234 కేసుల చొప్పున నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 101, ఢిల్లీలో 97, కర్ణాటకలో 91, రాజస్థాన్‌లో 83, తెలంగాణలో 77, గుజరాత్‌లో 70, తమిళనాడులో 67, జమ్మూకశ్మీర్‌లో 49, మధ్యప్రదేశ్‌లో 47, పంజాబ్‌లో 41, హర్యానాలో 36, ఆంధ్రప్రదేశ్‌లో 23, పశ్చిమ బెంగాల్‌లో 22, బీహార్‌లో 15, చండీఘర్‌లో 13, లడఖ్‌లో 13, అండమాన్ నికోబార్ దీవుల్లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 8, ఉత్తరాఖండ్‌లో 7, గోవాలో 5, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, మణిపూర్, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి