27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక

: రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరగనుంది. తొలి సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన నోటీసును ఈ నెల 25న జారీ చేయనున్నారు అధికారులు.